Monday 11 November 2013

సరిగమ పదనిస రాగం [ sarigama padanisa ragam ] [Pelli Sandadi 1996]



చిత్రం             : పెళ్లి సందడి [1996]
సంగీతం         : M M కీరవాణి
సాహిత్యం       : చంద్ర బోస్
పాడిన వారు   : S P బాలసుబ్రహ్మణ్యం, B వసంత 


సరిగమ పదనిస రాగం, త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం, ఎపుడెపుడన్నది మేళం
వన్నెల బొమ్మకు, వెన్నెల మావకు, కన్నులు కలిసిన వైనం
కన్నుల కలయిక కలలే కలుపగ మలుపొకటే కళ్యాణం

సరిగమ పదనిస రాగం, త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం, ఎపుడెపుడన్నది మేళం

గళము కోసమే గాత్రమున్నది
స్వరము కోసమే సరళి ఉన్నది
పొరుగు కోసమే పేపరున్నది
అతిధి కోసమే తిధులు ఉన్నది..శభాష్

పూత కోసమే మావి ఉన్నది
కూత కోసమే కోయిలున్నది
కోత కోసమే కరెంటు ఉన్నది
పెళ్ళి కోసమే పేరంటమున్నది

తాళి కోసమే ఆలి ఉన్నది
జారిపోవుటకే చోళీ ఉన్నది
బ్రహ్మ చారికై మెస్సులున్నవి
ఖర్మకాలుటకే బస్సులున్నవి
నగల కోసమే మెడలు ఉన్నవి
సుముహూర్తానికి చూపులున్నవి

సరిగమ పదనిస రాగం, త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం, ఎపుడెపుడన్నది మేళం

వన్నెల బొమ్మకు, వెన్నెల మావకు, కన్నులు కలిసిన వైనం
కన్నుల కలయిక కలలే కలుపగ మలుపొకటే కళ్యాణం

హృదయ నాదమై మధుర దాహమై
ఎదలు దోచుటకే పాటలున్నవి
పొలము లోపల కుప్పకుప్పగా  కూలి పోవుటకే ఫ్లైటులున్నవి
రామ కోటికే బామ్మలున్నది
ప్రేమ కాటుకే భామలున్నది
క్యూల కోసమే రేషన్లు ఉన్నది   కునుకు కోసమే ఆఫీసులున్నవి
మధుర వాణి మావెంట ఉన్నది  నాట్యరాణి మా ఇంట ఉన్నది
కీరవాణిలా ఆర్టు ఉన్నది
బాలు లోని టాలెంటు ఉన్నది
వియ్యమందుటకే తొందరున్నది
ఒకటయ్యేందుకే ఇద్దరున్నది

సససస........  స్స మరిసనిప సరిగమ పదనిస రాగం

పనిమప....  మరి రిపమరిసని నినిసస నిసరిస పమరిస రాగం

పానిస పానిస దనిసనిపమ మపని మపని సనిపమరిస సరిగమ పదనిస రాగం
ఆ...ఆ...ఆ...ఆ సరిగమ పదనిస రాగం
...... ఆ...ఆ...ఆ...ఆ
ఆ...ఆ...ఆ...ఆ
ఆ...ఆ...ఆ...ఆ ......  :p :p 

అందమే ఆనందం [ andame anandam ] [Bratuku Teruvu 1953]


నోట్: ఈ వీడియో లో Female Version [0:00 - 3:00] Male  Version [3:00 - 6:00]

చిత్రం             : బ్రతుకు తెరువు  [1953]
సంగీతం         : ఘంటసాల
సాహిత్యం       : సముద్రాల
పాడిన వారు   : ఘంటసాల[Male Version] పి.లీల [Female Version]



అందమే ఆనందం... అందమే ఆనందం....

ఆనందమే జీవిత మకరందం... అందమే ఆనందం.... "2"

పడమట సంధ్యా రాగం, కుడియెడమల కుసుమపరాగం  "2"

ఒడిలో చెలి మోహనరాగం...  ఒడిలో చెలి మోహనరాగం...
జీవితమే మధురానురాగం... జీవితమే మధురానురాగం...

అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం... అందమే ఆనందం....

పడి లేచే కడలి తరంగం, ఓ...ఓ...ఓ...
పడిలేచే కడలితరంగం, వడిలో జడసిన సారంగం "2"

సుడిగాలిలో.......ఓ... ఓ... ఓ...

సుడిగాలిలో ఎగిరే పతంగం,
జీవితమే ఒక నాటకరంగం... జీవితమే ఒకనాటకరంగమ్

అందమే ఆనందం...
ఆనందమే జీవిత మకరందం... అందమే ఆనందం....
ఓ.... ఓ... ఓ.... ఓ.... ఓ .....

విధాత తలపున [ Vidhata Talapuna] [Siri Vennela 1986]



చిత్రం            : సిరి  వెన్నెల  [1986]
సంగీతం        : K V మహదేవన్ 
Lyrics         : సిరి  వెన్నెల  సీతారామ  శాస్త్రి
పాడిన వారు   : S P బాల సుబ్రహ్మణ్యం, P సుశీల 

విధాత తలపున ప్రభవించినది, అనాది  జీవన  వేదం...    ఓం ...
ప్రాణనాడులకు  స్పందన నొసగిన,  ఆది  ప్రణవనాదం...    ఓం ...
కనుల  కొలనులో  ప్రతిబింబించిన,  విశ్వరూప  విన్యాసం...
ఎద కను మలలో...   ప్రతిధ్వనించిన  విరించి విపంచి  గానం......  ఆ.....ఆ...ఆ....

సరస--స్వర--సుర--ఝరీ--గమన--మవు  సామవేద  సారమిది...  "2"
నేపాడిన  జీవన  గీతం... ఈ  గీతం..

విరించినై... విరసించితిని  ఈ  కవనం..
విపంచినై... వినిపించితిని  ఈ  గీతం....

ప్రాగ్దిస వేణీయ పైన దినకర మయూఘ తంత్రులపైన..
జాగ్రుత విహంగతతులై వినీల గగనపు వేదిక పై'న...        "2"

పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీ'కారము కాగ..
విశ్వ--కావ్యమున--కిది   భాష్యముగా....  ""
విరించినై  విరసించితిని   ఈ  కవనం..
విపంచినై  వినిపించితిని  ఈ  గీతం....

జనించు  ప్రతి శిశు గళమున  పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన, స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం...  "2"

అనాది రాగం.. .  ఆది తాలమున అనంత జీవన వాహిని గా...
సాగిన సృష్టి విలాసమునే... ""
విరించినై  విరసించితిని   ఈ  కవనం..
విపంచినై  వినిపించితిని  ఈ  గీతం....

నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం.... "2"

సరస--స్వర--సుర--ఝరీ--గమన--మవు సామవేద సారమిది...
నేపాడిన  జీవన గీతం.... ఈ  గీతం.....