Monday 11 November 2013

సరిగమ పదనిస రాగం [ sarigama padanisa ragam ] [Pelli Sandadi 1996]



చిత్రం             : పెళ్లి సందడి [1996]
సంగీతం         : M M కీరవాణి
సాహిత్యం       : చంద్ర బోస్
పాడిన వారు   : S P బాలసుబ్రహ్మణ్యం, B వసంత 


సరిగమ పదనిస రాగం, త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం, ఎపుడెపుడన్నది మేళం
వన్నెల బొమ్మకు, వెన్నెల మావకు, కన్నులు కలిసిన వైనం
కన్నుల కలయిక కలలే కలుపగ మలుపొకటే కళ్యాణం

సరిగమ పదనిస రాగం, త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం, ఎపుడెపుడన్నది మేళం

గళము కోసమే గాత్రమున్నది
స్వరము కోసమే సరళి ఉన్నది
పొరుగు కోసమే పేపరున్నది
అతిధి కోసమే తిధులు ఉన్నది..శభాష్

పూత కోసమే మావి ఉన్నది
కూత కోసమే కోయిలున్నది
కోత కోసమే కరెంటు ఉన్నది
పెళ్ళి కోసమే పేరంటమున్నది

తాళి కోసమే ఆలి ఉన్నది
జారిపోవుటకే చోళీ ఉన్నది
బ్రహ్మ చారికై మెస్సులున్నవి
ఖర్మకాలుటకే బస్సులున్నవి
నగల కోసమే మెడలు ఉన్నవి
సుముహూర్తానికి చూపులున్నవి

సరిగమ పదనిస రాగం, త్వరపడుతున్నది మాఘం
తకధిమి తకధిమి తాళం, ఎపుడెపుడన్నది మేళం

వన్నెల బొమ్మకు, వెన్నెల మావకు, కన్నులు కలిసిన వైనం
కన్నుల కలయిక కలలే కలుపగ మలుపొకటే కళ్యాణం

హృదయ నాదమై మధుర దాహమై
ఎదలు దోచుటకే పాటలున్నవి
పొలము లోపల కుప్పకుప్పగా  కూలి పోవుటకే ఫ్లైటులున్నవి
రామ కోటికే బామ్మలున్నది
ప్రేమ కాటుకే భామలున్నది
క్యూల కోసమే రేషన్లు ఉన్నది   కునుకు కోసమే ఆఫీసులున్నవి
మధుర వాణి మావెంట ఉన్నది  నాట్యరాణి మా ఇంట ఉన్నది
కీరవాణిలా ఆర్టు ఉన్నది
బాలు లోని టాలెంటు ఉన్నది
వియ్యమందుటకే తొందరున్నది
ఒకటయ్యేందుకే ఇద్దరున్నది

సససస........  స్స మరిసనిప సరిగమ పదనిస రాగం

పనిమప....  మరి రిపమరిసని నినిసస నిసరిస పమరిస రాగం

పానిస పానిస దనిసనిపమ మపని మపని సనిపమరిస సరిగమ పదనిస రాగం
ఆ...ఆ...ఆ...ఆ సరిగమ పదనిస రాగం
...... ఆ...ఆ...ఆ...ఆ
ఆ...ఆ...ఆ...ఆ
ఆ...ఆ...ఆ...ఆ ......  :p :p 

No comments:

Post a Comment